రిపబ్లిక్ డే నాడు జాతీయ జెండాను రైతులు అవమానించారని తెలిపారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. బడ్జెట్ సమావేశాల సంద్భంగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన రామ్‌నాథ్…కోవిడ్ సహా అనేక దేశ ప్రజలు ఎదుర్కొన్నారని, అయితే కోవిడ్ సహా ఇతర సమస్యలపై దేశం ఐకమత్యంగా పోరాడిందన్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా సమస్య ఉందని, అయితే భారత్ సమర్థంగా ఎదుర్కొని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.పేదల కోసం వన్ నేషన్.. వన్ రేషన్ అమలు చేశామని, జన్‌ధన్ యోజన ద్వారా నేరుగా అకౌంట్లలోకి నగదు బదిలీ పేర్కొన్నారు.
రైతు ఉత్పత్తులపై కనీస మద్దతు ధరను తమ ప్రభుత్వం పెంచినట్లు రాష్ట్రపతి వెల్లడించారు. జనవరి 26వ తేదీన జరిగిన ఘటన ఆవేదనకు గురి చేసిందన్నారు. భావస్వేచ్ఛను కల్పించే రాజ్యాంగమే.. చట్టాలు, ఆంక్షలను పాటించాలని కూడా సూచించినట్లు రాష్ట్రపతి తెలిపారు. కొత్త సాగు చట్టాలతో సుమారు 10 కోట్ల మంది రైతులకు లాభపడనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సుమారు 1,13000 కోట్లు బదిలీ చేసినట్లు ఆయన వెల్లడించారు.