- Advertisement -
ఉర్దూ మీడియం డిగ్రీ విద్యార్థుల సౌలభ్యం కోసం ఉర్దూ అకాడమీ పాఠ్య పుస్తకాలను అచ్చు వేసింది. ఈ పుస్తకాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డిగ్రీ విద్యార్థుల కోసం ఉర్దూ మీడియంలో పాఠ్య పుస్తకాలను తీసుకు రావడం మన రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి సారి అన్నారు. చరిత్ర,రాజనీతి, ఆర్థిక శాస్త్రం పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అకాడమీ ఛైర్మన్ మహ్మద్ రహీముద్దీన్ అన్సారీని మంత్రి అభినందించారు.
- Advertisement -