తాగి రచ్చచేసిన హన్సిక …

232
hansika drink alcohol for movie
- Advertisement -

తెలుగు ,తమిళ భాషల్లో తనదైన నటనతో మెప్పించిన బ్యూటీ హన్సిక. ఇటీవలే మాలీవుడ్‌లోకి ప్రవేశించిన హన్సిక అక్కడ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. ఇలాంటి సమయంలోనే హన్సిక గురించిన వార్త పుకార్లు షికార్లు చేస్తోంది. ఈ అందాల భామ ఫుల్లుగా తాగి రచ్చరచ్చ చేసిందట. అయితే, చాలామంది హీరోయిన్స్ పార్టీల్లో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ తాగి షూటింగ్‌కి వచ్చే హీరోయిన్స్ మాత్రం అరుదుగా ఉంటారు.

కానీ అందాల భామ హన్సిక ఫుల్లుగా తాగి షూటింగ్ లో పాల్గొంది. వివరాల్లోకి వెళ్తే, ‘బోగస్’ చిత్రంలో హన్సికపై ఓ డ్రింకింగ్ సీన్ ఉందట. ఆ సీన్ ను పండించడం కోసం హన్సిక ఏకంగా నిజంగానే మద్యం తాగి సెట్ కు వెళ్లిందట. మద్యం మత్తులో కొంచెం రచ్చ చేసినా, సీన్ మాత్రం అద్భుతంగా వచ్చిందని దర్శకనిర్మాతలు ఖుషీ అయ్యారట.

ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత కూడా హన్సిక డ్రింకింగ్ సీన్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ అమ్మడు ఫుల్ ఖుష్ అయిందట. బోగన్ చిత్రం అరవింద్ స్వామి, జయం రవి ప్రధాన పాత్రలలో తెరకెక్కగా ఇందులో కథానాయికగా హన్సిక నటించింది. ఈ ఏడాది తెలుగులో విడుదలైన లక్కున్నోడు చిత్రం హన్సికకు కాస్త నిరాశను మిగిల్చిన బోగన్ హిట్ తో ఈ అమ్మడు ఫుల్ హ్యపీగా ఉందట. ఈ అమ్మడికి 60 లక్షల మంది ఫేస్‌బుక్‌ అభిమానులున్నారు.

- Advertisement -