ఫార్మాసిటీ మాస్టర్‌ ప్లాన్‌పై కేటీఆర్ రివ్యూ

258
- Advertisement -

హైదరాబాద్ ఫార్మా సిటీ పనులపైన మంత్రి కేటీఆర్‌ టీఎస్ ఐఐసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్ తయారీని సమీక్షించిన మంత్రి పలు సూచనలు చేశారు. ఈ  సందర్భంగా ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్న సుర్భానా జరొంగ్  ప్రతినిధులు మంత్రికి ఈ ప్లాన్ ప్రణాళికలను వివరించారు. గత సమీక్షా సమావేశంలో సూచించిన  కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను  ఈ మాస్టర్ ప్లాన్ లో పొందుపరుస్తున్నట్లు మంత్రికి తెలియజేశారు.

KTR Review on Pharma City

ఫార్మసిటీకి రోడ్డు సౌకర్యాల ఏర్పాటుపైన మంత్రి ఆరా తీసారు. ఫార్మసీటిలో ఏర్పాటు చేస్తున్న కనీస మౌళిక వసతులు ఏర్పాట్లను సైతం మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా ఫార్మసిటీలో నిర్మించనున్న ఒక ఫెసిలీటి భవనం గురించి మంత్రి తెలుసుకున్నారు. ఫార్మసిటీ కోసం చేస్తున్న భూసేకరణపైన రెవెన్యూ సిబ్బందితో మంత్రి కెటిరామరావు చర్చించారు.

ఫార్మసిటి తొలి దశ కోసం మెత్తంగా ఇప్పటిదాకా సూమారు 5500 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. టీఎస్‌  ఐఐసి కార్యాలయంలో నూతనంగా ఎర్పాటు చేసిన బోర్డు రూంను మంత్రి కెటి రామారావు ప్రారంభించారు. టియస్ ఐఐసి చైర్మన్ బాలమల్లుతో మంత్రి సమావేశం అయ్యారు. టీఎస్‌ ఐఐసి ద్వారా చేపట్టిన పలు పారిశ్రామిక పార్కుల అభివృద్ది, పనులను మంత్రికి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్‌ ఐఐసి చైర్మన్ బాలమల్లు, యండి వెంకట నర్సింహ రెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

KTR Review on Pharma City

- Advertisement -