శౌర్య బర్త్ డే స్పెషల్…ఈ ఏడాది 5 సినిమాలతో!

204
nagashourya
- Advertisement -

ఊహ‌లు గుస‌గుస‌లాడే , దిక్కులు చూడ‌కు రామ‌య్య‌ , ల‌క్ష్మిరావే మా ఇంటికి , క‌ళ్యాణ‌ వైభోగం , జ్యో అచ్యుతానంద లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగ‌శౌర్య. హిట్లు ప్లాపులు పక్కనపెట్టి ఈయన సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అశ్వద్ధామ తరువాత బ్రేక్ తీసుకుని నాగశౌర్య ప్రస్తుతం సినిమాలతో వస్తున్నాడు.

ఇవాళ జనవరి 21 నాగశౌర్య పుట్టిన రోజు సందర్భంగా కొత్త అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ ఏడాది వరుసగా 5 సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నాగ‌శౌర్య నటిస్తున్న కొత్త సినిమా పోలీసు వారి హెచ్చరిక ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజేంద్ర తెరకెక్కిస్తున్నాడు.

దీంతో పాటు పోలీసు వారి హెచ్చరిక, వరుడు కావలెను సినిమాలతో బిజీగా ఉన్నాడు నాగశౌర్య. ఈ మూడు సినిమాలతోపాటు మరో రెండు కథలు కూడా సిద్ధంగా ఉంటాడు నాగ శౌర్య. ఖచ్చితంగా 2021లో మూడు సినిమాలు విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులోనూ వేటికవే భిన్నమైన కథలతో వస్తున్నాడు ఈ కుర్రహీరో. ఈ పుట్టినరోజు వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్న నాగశౌర్య ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -