ఫిబ్రవరి నుండి చిరు 153..

137
chiru
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్‌.వి.ఆర్‌ ఫిలిమ్స్‌ పతాకాలపై రూపొందుతున్న తాజా చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌, అశ్వినీదత్‌, దానయ్య, నిరంజన్‌ రెడ్డి, నాగబాబు, కొరటాల శివ, సత్యానంద్‌, సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు పాల్గొన్నారు.

మలయాళంలో బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘లూసిఫర్‌’ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకుడు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఫిబ్రవరి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. మన నేటివిటీకి తగ్గట్లుగా మూల కథలో దర్శకుడు మోహన్‌రాజా మార్పులు చేశారు. చిరంజీవిగారికి ఇది మరో బ్లాక్‌ బస్టర్‌ సినిమాగా నిలుస్తుంది’ అని తెలిపారు.

దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ ‘మెగాస్టార్‌ కెరీర్‌లో మరో భిన్నమైన సినిమా ఇది. ‘లూసిఫర్‌’కు ఇది పూర్తిస్థాయి రీమేక్‌ కాదు. ఆ కథను తీసుకుని అందులో మెగాస్టార్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్చి, రూపొందిస్తున్నాం. మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి రచన: లక్ష్మీభూపాల్‌, సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: నీరవ్‌ షా, లైన్‌ ప్రొడ్యూసర్‌: వాకాడ అప్పారావు.చిరంజీవి హీరోగా నటిస్తున్న 153వ చిత్రమిది కావడం గమనార్హం.

- Advertisement -