77ఏళ్ల వయసులో 46వ అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఎక్కడో సెకండ్ హ్యాండ్ కార్ షోరూం ఓనర్ కొడుకుగా.. చాలీచాలనీ బతుకుల నుంచి ఇప్పుడు శ్వేత సౌధం వరకు.. బైడెన్ ప్రయాణం స్పూర్తిని కలిగిస్తుంది. కళ్లముందే కన్నవాళ్ల మరణాలు.. చావు దాకా వెళ్లొచ్చిన క్షణాలు.. ఒక్కటా రెండా బైడెన్ జీవితాన్ని పరికిస్తే.. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు.
జో బైడెన్ అసలు పేరు జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్. 1942లో అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్ ప్రాంతంలో జన్మించారు బైడెన్. 1966లో బైడెన్ నీలియా హంటర్‌ను వివాహమాడారు. వారికి ముగ్గురు బైడెన్ 1972లో 29ఏండ్ల వయస్సులో డెలావర్ నుంచి మొట్టమొదటిసారి సెనేట్‌కు ఎన్నికయ్యారు. అతి తక్కువ వయస్సులో సెనేట్‌కు ఎన్నికైన ఐదో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మొత్తం 6 సార్లు సెనేట్‌కు ఎన్నికయ్యారు. ఓ రోడ్డు యాక్సిడెంట్‌లో భార్య నీలియా, కూతురు నవోమీ చనిపోయారు. ఇద్దరు కుమారులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో తనకు ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని బైడెన్ ఓ సందర్భంలో చెప్పారు.
తన భార్య నీలియా మరణానంతరం 1977లో ఆయన జిల్ జాకబ్స్‌ను రెండో పెండ్లి చేసుకున్నారు. వారికి ఒక కూతురు. 1988లో బైడెన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఆయన ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. 2015లో బైడెన్ కుమారుడు బ్యూ బ్రెయిన్ క్యాన్సర్‌తో చనిపోయారు. అప్పుడే భార్య మాదకద్రవ్యాలకు బానిసయ్యారు. ఆ సమయంలో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.