రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులు ట్రాక్టర్ ర్యాలీని వాయిదా వేసుకోవాలని కోరింది సుప్రీం. అయితే దీనికి రైతులు ఎట్టి పరిస్ధితుల్లో అంగీకరించడం లేదు.
ఈ నేపథ్యంలో రైతు ర్యాలీని అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌పై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ట్రాక్టర్ ర్యాలీ విషయంలో అనుమతి ఇచ్చే అంశాన్ని ఢిల్లీ పోలీసులకే వదిలేసినట్లు కోర్టు చెప్పింది. ట్రాక్టర్ ర్యాలీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించాలని కేంద్రాన్ని సుప్రీం కోరింది.
వ్యవసాయ చట్టాల రద్దుపై సుప్రీం వేసిన కమిటీ నుండి ఒకరు వైదొలిగారని, మళ్లీ కమిటీని ఏర్పాటు చేయాలని కిషన్ మహాపంచాయతీ అడ్వకేటు కోర్టుకు వెల్లడించారు. అయితే రైతులతో చర్చించి, వారి అభిప్రాయాలను ఓ నివేదిక రూపంలో తీసుకురావాలని కమిటీకి చెప్పినట్లు సీజేఐ తెలిపారు. తాము ఏర్పాటు చేసిన కమిటీలో ఎటువంటి ఏకపక్షం లేదని, కోర్టుపై అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని సీజే అన్నారు.