శివారు ప్రాంతాల్లో చిరుత కలకలం!

145
leopard
- Advertisement -

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిరుత మరోసారి కలకలం రేపింది. బడంగ్‌పేట్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో జల్‌పల్లి, మామిడిపల్లి పురపాలక రోడ్డులో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు పహాడీషరీఫ్ పోలీసులు.

పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రహరి దూకుతూ చిరుత కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు.

గత సంవత్సరం రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 6 నెలల పాటు సంచరించిన చిరుత.. ఆ తర్వాత అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్‌లో చిక్కుకుంది. అయితే తాజాగా చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవతున్నారు.

- Advertisement -