పవన్‌ని కాదన్న రకుల్‌ .. !

171
Rakul Preet Says No To Pawan
- Advertisement -

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌తో తొలి విజయాన్ని అందుకున్న భామ రకుల్ ప్రీత్ సింగ్. తొలి సినిమా హిట్‌తో కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్ ఇలా బడా హీరోల సినిమాలలో కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది రకుల్. ప్రస్తుతం మహేష్ బాబు, మురుగదాస్ భారీ బడ్జెట్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్, బెల్లంకొండ శ్రీనివాస్ తాజా ప్రాజెక్టులోను నటిస్తోంది. ఇవే కాక పలు తమిళ సినిమాలు కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయని సమాచారం.

మెగా కుటుంబంలో రామ్‌ చరణ్‌ తో కలిసి వరుసగా రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటికి బన్నీతో కలిసి సరైనోడు చిత్రం చేసింది. ఈ చిత్రం అమ్మడికి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. ఇక రీసెంట్ గా మళ్లీ రామ్ చరణ్ తో జతకట్టింది. ధృవ చిత్రంలో చెర్రీ సరసన కథానాయికగా నటించిన రకుల్ కి మంచి మార్కులే పడ్డాయి. సాయిధరమ్ తో కలిసి విన్నర్ సినిమా చేసింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ రకుల్‌ని వరించింది. ఏఎం రత్నం నిర్మాణంలో టీఆర్ నీసన్ తెరకెక్కించనున్న చిత్రంలో రకుల్‌ని కథానాయికగా ఎంపిక చేయాలని భావించందట. కానీ రకుల్‌ ఈ గోల్డెన్‌ ఛాన్స్‌ని తిరస్కరించిందట. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న రకుల్‌ కాల్‌ షీట్లు అడ్జెస్ట్ గాక పవన్ మూవీ ఆఫర్‌ని తిరస్కరించిందట. దీంతో కొంతకాలంగా పవన్‌తో రకుల్‌ నటిస్తుందన్న వార్తలకు చెక్‌ పెట్టింది.

- Advertisement -