ఆగని పెట్రో వాత!

230
petrol
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.95, డీజిల్‌ ధర రూ.75.13కు చేరాయి. జైపూర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.43గా ఉండగా, డీజిల్‌ ధర రూ.84.46కు చేరింది.

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.88.37, డీజిల్‌ రూ.81.99గా ఉండగా కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.86.39, డీజిల్‌ రూ.78.72గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ రూ.91.56, డీజిల్‌ రూ.81.87,చెన్నైలో పెట్రోల్‌ రూ.87.64, డీజిల్‌ రూ.80.44,బెంగళూరులో పెట్రోల్‌ రూ.87.82, డీజిల్‌ రూ.79.67గా ఉంది.

- Advertisement -