పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలి: ఎర్రబెల్లి

145
minister errabelli
- Advertisement -

త్వరగా వైకుంఠ ధామాలు,పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయించాలని.. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయించండి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో పంచాయితిరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తనియా,పంచాయితీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు,ఈఎన్‌సీ పీఆర్‌ సంజీవ రావు హాజరైయ్యారు.

ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయించండి అని సూచించారు. సీఎం కెసిఆర్,మంత్రి కేటీఆర్‌ గ్రామ పంచాయతీల అభివృద్ధి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు.మొన్న సీఎం కేసిఆర్ మన శాఖల పనితీరును అభినందించరని.. ఈ అభినందనలతో అధికారులు ఉత్సాహంతో పనిచేయాలని.. ఈ అభినందనలు మన అందరి కృషి వల్లనే వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

- Advertisement -