బన్నీకి కోపం వచ్చిందట .. !

281
Allu Arjun Angry on DJ Shooting
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏ కార్యక్రమంలో ఉంటే అక్కడ సందడే సందడి. అర్జున్ సరదాగా ఉంటాడని పలువురు హీరోలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కానీ అలాంటి అల్లు అర్జున్‌కి కోపం వచ్చింది. తన కోపానికి కారణమైన వారికి బన్నీ వార్నింగ్ కూడా ఇచ్చాడట. వివరాల్లోకి వెళ్తే … అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిల్మ్ దువ్వాడ జగన్నాధమ్. హరీష్ శంకర్ డైరెక్టర్ చేస్తున్న ఈ మూవీ విషయంలో  చిత్ర యూనిట్ ఎంతో కేర్ తీసుకుంటోంది. సినిమాకు

సంబంధించి  ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సినిమాకు సంబంధించిన వార్తలు, ఫోటోలు లీకవుతున్నాయి. దీంతో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సినిమా పిక్స్ లీకవటంపై బన్నీకి పట్టరాని కోపం వచ్చిందట. దీంతో మరోసారి అలా జరగకుండా చూడాలని యూనిట్ సభ్యులకు వార్నింగ్ ఇచ్చాడట.

దువ్వాడ జగన్నాథమ్ సినిమా కోసం ఇటీవల సంగీత్ సీన్ షూట్ చేస్తున్నారట. అందుకోసం భారీగా మోడల్స్ ను పిలిపించారట. షూటింగ్ సందర్భంగా సంగీత్ కార్యక్రమం కోసం వేసిన సెట్ లో సుందరాంగులు సెల్ఫీలతో హంగామా సృష్టించారట. అంతేకాకుండా బన్నీతో సెల్పీలకు ఎగబడ్డారట. దాంతో కోపగించుకొన్న ఆయన ‘సంగీత్ సెట్ చిత్రాలు లీక్ కావడం నాకు ఇష్టం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయాడట. ఇప్పుడు టీ టౌన్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. బన్నీని ఇంత సీరియస్‌గా చూడటం  ఇఏద ఫస్ట్ టైం అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి దువ్వాడ జగన్నాథంపై బన్ని ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో అర్ధమవుతుంది.

- Advertisement -