సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్లు సెకెండ్ బిజినెస్ లు కలిగి ఉండటం మనకు కోత్తేం కాదు. ఈ పద్దతి ఒకప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా ఉండేది. హీరోలైతే హొటల్ బిజినెస్ లూ.., ట్రావెల్ ఏజెన్సీలూ స్థాపిస్తే హీరోయిన్లు బాడీ ఫిట్ నెస్ సెంటర్లూ, పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలూ స్టార్ట్ చేసారు.అయితే సౌత్ లో మాత్రం మన హీరోలు బూములూ.., రియలెస్టేట్ల వైపు మళ్ళినా తరువాత తరువాత ట్రెండ్ మారుంది…. మనోళ్ళు కూడా పబ్ లో లేదంటే హొటల్స్ వైపో మళ్ళటం మొదలు పెట్టారు. డైరెక్ట్ గా వారే కాకపోయినా కుటుంబసబ్యులతో కలిసి ఇలాంటి వెంచర్లు చేయటం లేదంటే టీవీ, బులియన్ మార్కెట్ రంగాల్లోనూ అడుగుపెట్టారు….
సినీ నటుల కుటుంబాలు ఏ కార్యక్రమం చేపట్టినా ప్రచారానికి ఇబ్బంది లేదు.ప్రముఖ నటుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి వ్యాపార రంగంలోకి వచ్చి ఒక పోటో స్టూడియోని ఆరంభించారు.ఆ స్టూడియో పేరు పికాబో. ఈ స్టూడియో గురించి అర్జున్ ట్విటర్ ద్వారా అబిమానులకు తెలియచేశారు. అది వార్తగా కూడా మారింది. మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. పికాబో ఫోటో స్టూడియో ప్రతీ ఒక్కరి అద్భుతమైన క్షణాలను ఫోటోల రూపంలో అందిస్తోందని అర్జున్ ట్వీట్లో పేర్కొన్నారు. పికాబో స్టూడియోలో తీసిన కొన్ని ఫొటోల కలెక్షను ఆయన పోస్ట్ చేశారు. ఇటు అబిమానులను సంతోషపరిచినట్లు అయింది. మరో వైపు ఆయన భార్య కు చెందిన ఫోటో స్టూడియోకి తేలికగా ప్రచారం కల్పించినట్లు అయింది.