డాన్‌శీను, బలుపు వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన చిత్రం క్రాక్
. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నాను. సరస్వతి ఫిలిం డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మాస్‌రాజా రవితేజ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
తమిళనాడులో ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా 100% సీటింగ్ కెపాసిటీ పర్మీషన్ వస్తే బాగుండేది అనిపించిందా?
- మన దగ్గర కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలిసింది. పర్మీషన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏది ఏమైనా థియేటర్‌కి వచ్చి సినిమా చూసే ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. అలాగే వీలైతే చిన్న శానిటైజర్ బాటిల్ కూడా మీ వెంట తెచ్చుకోవాల్సిందిగా నా తరుపున మనవి.
కరోనా తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేసిన కొంత భయం అయితే ఉంటుంది కదా?
- లాక్డౌన్ తర్వాత దాదాపు 200మంది డ్యాన్సర్స్‌తో 2 సెట్ సాంగ్స్ షూట్ చేశాం. సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే మా సెట్లో ఎవ్వరికి కరోనా రాలేదు. దాంతో మాకు కొంత ధైర్యం వచ్చింది. కనీస జాగ్రత్తలు తీసకుంటే తప్పకుండా షూటింగ్స్ జరుపుకోవచ్చు అని..ఒకవేల సెట్లో ఎవరైనా మాస్క్ లేకుండా కనిపిస్తే తప్పకుండా మాస్క్ వేసుకోమని చెప్పేవాడిని.
సంక్రాంతికి వస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది?
- మాములు రోజుల్లో ఒక సినిమా చూడడానికి, పండుగ సీజన్లో మూవీ చూడడానికి ఎక్కడో చిన్న తేడా ఉందని నేను భావిస్తాను..ఎందుకంటే నేను కూడా అలా సినిమాలు చూసి వచ్చిన వాణ్నే కాబట్టి. అయితే ఈ పండుగకి పక్కా కమర్షియల్ ఫిలిం. నా క్యారెక్టర్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తే చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. మాస్ ఎలిమెంట్స్ సూపర్‌గా ఉన్నాయి, అలాగే పాటలు కూడా బాగా కుదిరాయి. ఈ పండుగకి తప్పకుండా సినిమా ఒక విందు బోజనంలా ఉంటుంది. ఆడియన్స్ కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.
గోపిచంద్ మలినేని, మీ కాంబినేషన్లో వచ్చిన రెండు మూవీస్ సక్సెస్ అయ్యాయి కదా ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుందా?
- డెఫినెట్‌గా హ్యాట్రిక్ కొడతాం అనుకుంటున్నాం. ఎందుకో తెలీదు మా ఇద్దరికీ ప్రాపర్‌గా సెట్ అయ్యింది. ఈ సినిమా తప్పకుండా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ డబుల్ మాస్ అనుకోవచ్చా?
- డబుల్ మాస్ లేదా త్రిబుల్ మాస్ఆ అనేది రేపు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.
పూరిజగన్నాధ్ తర్వాత గోపిచంద్ మలినేనితోనే ఎక్కువ సినిమాలు చేశారు కదా..? - అలా కుదిరింది అంతే..ఏది ప్లాన్ చేసి చేయలేదు..ఒకవేల అలా ప్లాన్ చేసిన సెట్ అవదు.
లాక్డౌన్ ఎలా గడిచింది?
- అద్భుతంగా గడిచింది. నేను మాములుగానే ఫ్యామిలీ మెన్ని. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతాను. ఈ లాక్డౌన్ వల్ల ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయగలిగాను. అలాగే హ్యాపీగా వర్కవుట్స్ చేసుకున్నాను. నెట్లో చాలా కంటెంట్ ఉంది. బోలెడు సినిమాలు చూశాను. చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక్క క్షణం కూడా బోర్‌గా ఫీలవ్వలేదు.
- మీ పిల్లలు మిమ్మల్ని ఇలాంటి క్యారెక్టర్లో చూడాలి అని అనుకుంటున్నారా?
- నేనేం చేసినా వారికి తప్పకుండా నచ్చుతుంది.
జనవరి 26 మీ పుట్టినరోజు కదా బర్త్ డే ప్లాన్స్ ఏంటి?
- స్పెషల్ ప్లాన్స్ అంటూ ఏమి లేవు..మాములుగానే నేను బర్త్‌డేస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. ఈ నెలలో నా సినిమా రిలీజవుతుంది అదే నాకు పెద్ద పండుగ.
సంగీత దర్శకుడు తమన్ గురించి చెప్పండి?
- మొదట్లో పూరిజగన్ కాంబినేషన్లో చక్రీతో ఎక్కువ సినిమాలు చేశాను. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేసింది తమన్ తోనే..నాకు ఎలాంటి పాటలు ఇవ్వాలో తమన్‌కి బాగా తెలుసు. ఈ సినిమాలో పాటలకి బ్రహ్మండమైన రెస్పాన్స్ వస్తోంది.
మిగతా క్యారెక్టర్స్ గురించి?
-శృతి హాసన్ చాలా మంచి క్యారెక్టర్ చేసింది. అలాగే సముద్రఖని గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన ఒక మంచి పాత్రలో కనిపిస్తారు. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. తమన్ మ్యూజిక్‌తో పాటు జీకే విష్ణు విజువల్స్ కూడా ఈ సినిమాకి మెయిన్ అసెట్. రియల్ ఇన్స్‌డెంట్స్, రియల్ క్యారెక్టర్స్ తీసుకొని చేసిన సినిమా ఇది.
ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడితే ఇమ్మిడియెట్‌గా మరో సినిమా ఉంటుందా?
- డెఫినెట్‌గా ఉంటుంది..
ఈ పండుగకి కాంపిటేషన్ ఎలా ఫీలవుతున్నారు?
- మనం ప్రతి సంక్రాంతికి చూస్తూనే ఉన్నాం. సినిమా బాగుంటే అన్ని సినిమాలు ఆడుతాయి. ఎందుకంటే ఒక సినిమా చూశాక మరో సినిమా చూడను అని ఎవరూ అనుకోరు. అన్ని సినిమాలు చూస్తారు.. పండుగంటే అదే కదా..
మీరు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చేశారు కదా..మీ క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అయ్యాం అని ఎవరైనా పోలీసులు చెప్పారా?
- ఎప్పుడైనా బయట ఈ వెంట్స్‌కి వెళ్లి నప్పుడు కలిసి విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్‌కి ఫ్యాన్స్ అండీ అని చెబుతుంటారు. ఈ సినిమా తర్వాత కూడా మళ్లీ అది రావచ్చు అని అనుకుంటున్నాను.
మీ అబ్బాయి మహాదన్ ని మళ్లీ ఎప్పుడు సినిమాల్లో చూడొచ్చు?
- రాజాదిగ్రేట్ సినిమాలో అనిల్ పట్టుబట్టి మహాదన్‌తో ఆ క్యారెక్టర్ చేయించాడు. తను ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఇంకా చాలా టైమ్ ఉంది. ఆ సమయానికి వాడికి ఏది అనిపిస్తే అదే చేయమని చెప్తాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి?
- ప్రస్తుతం ఖిలాడీ సినిమా షూటింగ్ జరుగుతోంది. తర్వాత ఏ సినిమా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.