హడలెత్తిస్తున్న ట్రంప్ … అటార్ని జనరల్‌పై వేటు

191
Donald Trump Fires Attorney General
- Advertisement -

అమెరికా అధ్యక్ష బరిలో ఉండగానే తన దూకుడును చూపించిన ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింతగా రెచ్చిపోతున్నాడు. ఇప్పటికే ముస్లిం దేశాల పౌరులకు వీసాలు ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్ తాజాగా తన నిషేధాజ్ఞలను పట్టించుకోని అధికారులపై వేటు వేశారు. ప్రస్తుత అటార్నీ జనరల్ సలే యాట్స్ పై వేటు వేసిన ట్రంప్ ఆ స్ధానంలో డనా బౌంటేను నియమించారు.

అమెరికన్ల ప్రయోజనం కోసం జారీ అయిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సమర్థించకుండా సలే యాట్స్‌ విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని అందుకే ఆమెను తొలగించామని తెలిపారు. అటార్ని జనరల్‌ను తొలగించిన కొద్ది సేపటికే ట్రంప్ ట్విట్ చేశారు. ఒబామాచేత నియమితురాలైన అధికారులు మా పనికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని విమర్శలు గుప్పించారు. మరోవైపు అమెరికాలో ప్రవేశించే విదేశీ పౌరులపై మరిన్ని ఆంక్షలు  విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఏడు ముస్లిం దేశాల పౌరుల ప్రవేశంపై నిషేధం విధించిన అగ్రరాజ్యం  ఇకపై తమ దేశానికి వచ్చే విదేశీయులు వారి ఫోన్‌ నంబర్లను, సోషల్ మీడియా వివరాలను, ఇంటర్నెట్‌లో వారు శోధించిన అంశాల గురించి తెలిపే బ్రౌజింగ్‌ హిస్టరీని అందజేయాలనే షరతులను విధించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ సమాచారం ఇవ్వడానికి నిరాకరించని వారిని అమెరికాలోకి అనుమతించబోమని వైట్ హౌస్ పాలసీ డైరెక్టర్ స్టీఫెన్ మిల్లర్ తెలిపారు.

మరోవైపు ఏడు ముస్లిం దేశాల పౌరుల ప్రవేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రోజురోజుకు ఆందోళనలు రెట్టింపవుతున్నాయి.

- Advertisement -