మేవార్ రాణి పద్మావతి విషయంలో చరిత్రను వక్రీకరిస్తూ.. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావతి’ సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ కర్ణిసేన ఆయనపై, చిత్రయూనిట్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ నటులంతా భన్సాలీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ..చిత్ర యూనిట్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. దాడిని దిగినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే భన్సాలీ పై జరగిన దాడిపై బాలీవుడ్ నటుడు ‘ధోనీ’ సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ భిన్నంగా నిరసన తెలిపాడు.
భన్సాలీపై రాజ్‌పుత్‌ల దాడిని ఖండిస్తూ ఆయన సుశాంత్ సింగ్ తనదైన శైలిలో నిరసన తెలిపాడు. ట్విట్టర్లో ప్రొఫైల్ పేరులో తన కులాన్ని సూచించే ఇంటిపేరును తొలగించాడు. భన్సాలీకి సంఘీభావంగా ఆయన తన పేరులోని ‘సింగ్ రాజ్‌పుత్’ను తొలగించి.. ట్విట్టర్లో సుశాంత్ అని మాత్రమే ఉంచారు. ‘ఇంటిపేర్లపై మమకారం పెంచుకున్నంతకాలంతో మనం ఇలా బాధపడకతప్పదు. మీకు ధైర్యముంటే ‘పద్మావతి’కి మద్దతుగా ఇంటిపేరును మాకు ఇచ్చేయండి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. రీసెంట్గా విడుదల ధోని సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు సుషాంత్.
https://twitter.com/itsSSR/status/825043568964227072