ఆరోగ్య శ్రీ సేవలు మరింత మెరుగుపరచాలి- మంత్రి

171
etala rajender
- Advertisement -

మెడికల్ సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్, డాక్టర్స్, మెడికల్ కాలేజీల హాస్పిటల్‌ల సూపరింటెడెంట్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న మౌలికవసతులు, అధ్యాపకులు, స్టాఫ్, సమస్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజా విధివిధానాలకు అనుగుణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర శాఖ బంద్ లు, ధర్నాలు జరిగిన వైద్య ఆరోగ్య సిబ్బంది 365 రోజులు పని చేస్తుంది. కరోనా సమయంలో పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేసినం. కరోనా సమయంలో కూడా క్యాన్సర్, డయాలసిస్, తలసిమియ లాంటి జబ్బులకు అంతరాయం లేకుండా వైద్య సేవలు అందిచామని మంత్రి అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వరకు అన్ని హాస్పిటల్ లు ఒక చైన్ లాగా పని చేయాలి. చిన్న చిన్న జబ్బులకు పెద్ద ఆసుపత్రులకు రాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స అందిచెందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు. జిల్లా మెడికల్ కాలేజీల్లో అన్ని రకాల చికిత్స అందించాలని కేవలం అత్యవసర, క్లిష్ట సమస్యలకి మాత్రమే పెద్దాసుపత్రులకు పంపించాలని మంత్రి కోరారు.

అన్ని మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూపరింటెండెంట్ లను మంత్రి ఆదేశించారు. ఆరోగ్య శ్రీ సేవలు మరింత మెరుగు పరచాలని సూచించారు. కరోనా సమయంలో శక్తి వంచన లేకుండా పని చేసిన మెడికల్ కాలేజీల సిబ్బంది అందరికీ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా రమేష్ రెడ్డి, టీఎస్‌ఎంఐడీసీ ఎండి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.

- Advertisement -