- Advertisement -
పేద క్రైస్తవులను అందరినీ అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. క్రిస్మస్ సందర్భంగా మహబూబ్నగర్ ఎంబీసీ చర్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్… జిల్లా కేంద్రంలో వారం రోజుల్లో క్రైస్తవ భవన్ పనులు ప్రారంభిస్తామన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం కూడా క్రైస్తవులను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్, క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -