హైదరాబాద్ గగన్ పాడ్ లో జరిగిన మహా మృత్యుంజయ యజ్ఞం లో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..ఏ పూజ చేసిన , ఏ శుభ కార్యక్రమం చేసిన మొదట గో పూజ చేస్తాం..అది మన ఆచారం ఆనవాయితీ అన్నారు. ఇంత మంచి గోశాలను ఏర్పాటు చేసిన ఈ సంస్థ ను అభినందిస్తూ… ఈ గోశాలకు నా వేతనం నుండి గోశాలకు ఒక రోజు అయ్యే ఖర్చు ఒక లక్ష యాభై వెయిల రుపాయలు అందిస్తున్నానని తెలిపారు. ఇంత పెద్ద గోశాల మన హైదరాబాద్ నగరాన్ని అనుకోని ఉంది… దక్షిణ భారత దేశం లో మొట్ట మొదటిది భారత దేశం లో రెండవ అతి పెద్దది అన్నారు. 5500 గోవులను మార్వాడి పెద్దలందరు గోవులను సంరక్షిస్తూన్నారు…. కబేళాలకు వెళ్ళవలసిన గోవులను తెచ్చి రక్షించి వాటికి పునర్జన్మ నిస్తున్నారని చెప్పారు.
ఈ సమాజం అంత బాగుండాలని చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు..నాకు చాలా సంతోషంగా ఉన్నది గోవు చాలా ముఖ్యమైనది మనిషికి రైతుకు ఆవు ఉంటే చాలు అనేవారు..పాత రోజులలో గో మూత్రం ,గో మలం,వేపాకు చక్కటి సేంద్రియ ఎరువులతో కూడిన వ్యవసాయం చేసేవారు అదే యురియా,పెస్టిసైడ్స్ ల వాడే వారు మంచి వ్యవసాయాన్ని చేసేవారు..మంచి పంటలు పండించారు ఆరోజులలో క్యాన్సర్ లాంటి పలు విధాలా రోగాలు లేవు..ఈ రోజుల్లో టెక్నాలజీ ఏవిధంగా పెరిగిందో రసాయనల ఎరువుల వాడకం పెరిగిందన్నారు. అందుకే ఈ మధ్య కాలం లో హైదరాబాద్ లో ఆర్గానిక్ షాపులు కనిపిస్తున్నాయి..డబుల్ ధరలు పెట్టికూడా కొనుకుంటున్నామని వెల్లడించారు.
మళ్ళీ ఈ సేంద్రియ వ్యవసాయం గోవు ,గో మూత్రం ,గో మలం ప్రాముఖ్యత ను గుర్తిస్తున్నారు..మంచి తాత్కాలికంగా పోవచ్చు కానీ చివరకు అదే నిలబడుతుంది..నా సిద్దిపేట నియోజకవర్గం లో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను గుర్తించి 150 మందికి గోవులను దానం ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్గానిక్ ఫామ్ సేంద్రియ వ్యవసాయం చేయండని కోరాము…ఇక్కడకు వచ్చి చూశాక ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం….ఇంతమంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు అందరికి పెరు పేరున ధన్యవాదాలు తెలిపారు.