బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 99 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 4 మరోవారంలో ముగియనుండగా లాస్ట్ వీక్‌కు ముందు మోనాల్ ఎలిమినేట్ అయింది. దీంతో హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు అఖిల్, సొహైల్,అభిజిత్,హారిక,అరియానా ఉండగా వీరిలో ఒకరు విజేతగా నిలవనున్నారు. ఓటింగ్ అప్పుడే ప్రారంభమైంది.
మోనాల్ ఎలిమినేషన్‌తో అఖిల్ షాక్ తిన్నాడు. వెళ్తూ వెళ్తూ అఖిల్‌కి పువ్వు ఇచ్చి కన్నీటి విడ్కోలు తెలిపింది. బిగ్ బాస్ స్టేజీ మీదకు వచ్చిన మోనాల్ టైటిల్ గెలవాలంటే ఏం మార్చుకోవాలో ఇంటిసభ్యులకు సలహాలిచ్చింది. అందరితో మాట్లాడమని, ముఖ్యంగా అఖిల్‌కు సమయం కేటాయించమని అభిజిత్‌కు సూచించింది.
అరియానాకు టాస్క్‌లో అంత అగ్రెసివ్ వద్దని సూచించింది. సోహైల్ చిన్న చిన్న మాటలకు బాధపడొద్దని తెలపగా తన బాధను పాటరూపంలో వెలిబుచ్చాడు అఖిల్. ‘ఉండిపోరాదే, గుండె నీదేలే..’ అంటూ గుండె లోతుల్లోని ప్రేమను వెలికితీస్తూ పాడటంతో ఆమె కళ్ల వెంట నీళ్లు జలజలా రాలాయి. నిన్ను బాధపెట్టినందుకు సారీ అంటూనే వారం తర్వాత వచ్చి మాట్లాడతానన్నాడు.