రజనీ పొలిటికల్‌ ఎంట్రీపై చిరు ఆసక్తికర ట్వీట్‌..

195
chiranjeevi
- Advertisement -

శనివారం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపుతున్నారు. కాగా తలైవా పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ రాజకీయప్రవేశంపై కోలీవుడ్ టాలీవుడ్ సహా జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి రజనీ పొలిటికల్‌ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరు ట్విట్టర్ లో తలైవాకు బర్త్ డే విషెస్ తెలియజేశారు.

ప్రియమైన మిత్రుడు రజనీకాంత్ కు 70 వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అద్భుతమైన జీవితం కావాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లో ప్రవేశిస్తున్నందున మీరు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీదైన ప్రత్యేక శైలితో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. వారికి సేవ చేయడంలో కూడా ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరిస్తారని నమ్ముతున్నాను! ధన్యులు అని చిరంజీవి ట్వీట్ చేశారు.

- Advertisement -