- Advertisement -
బంగారం కొనుగోలు దారులకు శుభవార్త..బంగారం ధర బారీగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర గత రెండు రోజుల్లో భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 తగ్గి రూ.50,070గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 తగ్గి రూ.45,900కు చేరింది. ఇవాళ బంగారం ధర నిలకడగా ఉంది.
బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గింది. గత రెండు రోజుల్లో వెండి ధర ఏకంగా రూ.2,700 పడిపోగా ప్రస్తుతం వెండి ధర రూ.66,800గా ఏంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ప్రధాన కారణం అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
- Advertisement -