- Advertisement -
ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మొక్కలు నాటారు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా గోల్నాక లోని క్యాంపు కార్యాలయం ఆవరణలో ఆయన మూడు మొక్కను నాటడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ పకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బాధ్యతగా అందరూ మొక్కలు నాటి వాటిని రక్షించాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -