- Advertisement -
సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు సీఎం. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై కేంద్రమంత్రులతో చర్చించే అవకాశం ఉంది.
శుక్రవారం కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో శనివారం కేంద్ర పౌరవిమానయాన, హౌసింగ్‌శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురిని కలవనున్నారు. ఆదివారం ఆయన తిరిగి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. సీఎం వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు.
- Advertisement -