- Advertisement -
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని తలపెట్టిన భారత్ బంద్‌కు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి.
షాద్‌నగర్ బూర్గుల టోల్ గేట్ వద్ద బంద్‌లో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
భారత్ బంద్‌కు మద్దతుగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు టెక్రియల్ చౌరస్తాకు ర్యాలీగా చేరుకున్నారు. ఎంఎల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొని నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు.
- Advertisement -