ఎన్టీఆర్‌తో సినిమా చేసి నష్టపోయా….

322
Bandla Ganesh A bout jr Ntr
- Advertisement -

బండ్ల గణేష్ కమెడియన్‌ స్థాయి నుంచి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన వారిలో ఒకరు. ఒకప్పుడు సినిమాలో సైడ్‌ క్యారెక్టర్లు వేసిన బండ్ల గణేష్‌ ఒక ప్రొడ్యూసర్‌గా ఎదిగాడంటే అతియోశక్తి కాదేమో. బండ్ల గణేష్‌ పవన్ కళ్యాణ్‌, జూ.ఎన్టీయార్‌, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి హీరోలతో పాటు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ముఖ్యంగా బండ్లగణేష్‌ ఓ రాజకీయ వ్యక్తికి బినామీ అంటూ ప్రచారం ఉంది. లేకపోతే సైడ్‌ క్యారెక్టర్‌ వేసుకునే బండ్ల గణేష్‌ ఏకంగా ప్రొడ్యూసర్‌ ఎలా అవుతాడు అన్నది పలువురి ప్రశ్న. అయితే పలువురి హీరోలతో కూడా బండ్ల గణేష్‌కు వివాదాలు ఉన్నాయంటూ టాలీవుడ్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Bandla Ganesh A bout jr Ntr

‘టెంపర్‌’ సినిమా తర్వాత ఒక్కసారిగా అదృశ్యమైన గణేష్‌. తాజాగా పవన్‌తో దిగిన ఫోటోను ట్వీట్‌ చేసి మళ్లీ వార్తల్లోకెక్కాడు…ఆ తర్వాత తాజాగా ఓ మీడియా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వుల్లో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. నాకు ఎస్వీ కృష్ణారెడ్డి జీవితాన్ని ఇచ్చాడ అంటూ కన్నీటీ పర్యంతం అయ్యాడు. హీరో రవితేజను మోసం చేశానన్ని… రవితేజ ఎంతో ఇష్టపడి తన వద్ద పొలం కొనుకున్నాడని,అయితే ఆ పొలం విషయంలో ఆయనను మోసం చేశానని పేర్కొన్నాడు. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌తో చేసిన బాద్‌షా చిత్రంతో చాలా నష్టపోయానని, దాంతో ఎన్టీఆర్‌కు నాకు విభేదాలు ఏర్పడ్డాయని అన్నారు. నేను మొదట ఫిల్మ్‌ఇండస్ట్రీకి వచ్చిన ప్పుడు సెక్స్ సినిమాలో హీరో క్యారెక్టర్‌ చేసానని నిర్మొహమాటంగా చెప్పాడు బండ్ల గణేష్‌.

Bandla Ganesh A bout jr Ntr

ఇక, తన దేవుడు పవన్‌కల్యాణ్‌కు ఎవరూ సహాయం చేయనవసరం లేదని, తన సమస్యను ఆయనే పరిష్కరించుగోలడని అన్నాడు. అలాగే ఓ దర్శకుడు రాత్రంతా మందు కొడుతూ, డ్రగ్స్‌ తీసుకుంటూ గడుపుతాడని, ఆయనతో పనిచేయడం తన దురదృష్టమని అన్నాడు. అయితే ఆ దర్శకుడి పేరు చెప్పడానికి మాత్రం నిరాకరించాడు నిర్మాత బండ్ల గణేష్‌.

Bandla Ganesh A bout jr Ntr

నా స్థాయి, స్టామినా వేరని, అవసరమైతే ఒక వారం రోజుల్లో ట్రంప్ దగ్గరికి వెళ్లి ఫోటో దిగి మీకు ఇస్తానని, నయీమ్, బొయీమ్ లతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు అవన్ని వంటి పుకార్లే, నామీద ఈగ వాలదు, మమ్మల్ని ఎవరూ టచ్‌ చేయలేరు, బండ్లగణేష్‌ మీద రెండవ యాంగిల్‌ మీకు ఎవరికీ తెలియదంటూ తన గురించి తాను ఒకరేంజ్‌లో చెప్పుకున్నాడు నిర్మాత బండ్ల గణేష్‌.

- Advertisement -