TRS శ్రేణులు రైతుల పోరాటానికి మద్దతుగా నిలవాలి- మంత్రి

154
Minister Prashanth Reddy
- Advertisement -

ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు రైతుల న్యాయపోరాటానికి మద్దతుగా భారత్ బంద్ లో పాల్గొనాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటాన్ని సమర్థిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో బిజెపి ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని వేముల చెప్పారు.పార్టీ అధినేత,రైతు పక్షపాతి కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు భారత్ బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.బంద్ ను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాడుతున్న రైతులకు అండగా నిలవాలని నిజామాబాద్ జిల్లా ప్రజలకు మంత్రి వేముల విజ్ఞప్తి చేశారు.

- Advertisement -