పెట్టుబడులతో వస్తాం..జపాన్, కొరియా కంపెనీలు

189
Minister
- Advertisement -

తెలంగాణ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రామారావు దక్షిణ కొరియా, జపాన్ దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. గురువారం రాత్రి జపాన్ నుంచి మంత్రి బృందం తెలంగాణకు బయలుదేరుతారు. ఈ పర్యటన ద్వారా ఏలక్ర్టానిక్స్ తయారీ రంగంలో అగ్రదేశాలుగా ఉన్న ఈ రెండు దేశాల్లో తెలంగాణ గురించి పరిచయం చేయగలిగామని మంత్రి కెటి రామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, ముఖ్యంగా టియస్ ఐపాస్ గురించి పారిశ్రామిక వేత్తలకు వివరించినప్పుడు వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ…ఇలాంటి అద్భుతమైన పెట్టుబడుల స్నేహపూర్వక పాలసీ వలన ఖచ్చితంగా తెలంగాణకు మేలు కలుతుందని మంత్రి బృందం తెలియజేశారు.

Minister

Hitachi, Softbank, Toshiba, Sumitomo, Eisai వంటి కంపెనీల ప్రతినిధులు త్వరలో తెలంగాణలో పర్యటిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇక ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న కార్యకలాపాలను విస్తరించేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. జెట్రో, KEIDENRAN వంటి జపనీస్ వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశాల వలన తెలంగాణ పట్ల వారికి సరైన అవగాహన కుదిరిందన్నారు. తెలంగాణ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొరియా, జపాన్ కంపెనీల పెట్టుబడుల గమ్యస్థానం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే పలు కంపెలనీతో జరిగిన చర్చల వివరాలను అందిస్తామన్నారు.

నవంబర్ లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సు కోసం అనేక కంపెనీలను ఆహ్వానించామని..సదస్సుకు వచ్చేందుకు సాఫ్ట్ బ్యాంకు సీఇఓ అంగీకరించినట్టు తెలిపారు. ఈ మేరకు మరోసారి జపాన్ కంపెనీల కోసం టోక్యో, ఒసాకా నగరాల్లో వాణిజ్య సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. జపాన్, కొరియా కంపెనీలు తమ కోసం ప్రత్యేకంగా ఒక పారిశ్రామిక జోన్ ఏర్పాటు చేయాలని కోరినట్టు మంత్రి తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలోని యంయస్,యంఈ ల కోసం జపాన్ కంపెనీలు సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. తెలంగాణలోని టి హబ్, టాస్క్ వంటి సంస్ధలతో పలు జపాన్ కంపెనీలు కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు.

ఏలక్ర్టానిక్స్, ఫార్మా, వైద్య పరికరాల తయారీ, మెడికల్ టూరిజం వంటి రంగాల్లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వంటి రాష్ర్టాలకు ఆది నుంచి ఒక కీలకమైన ఫండింగ్ ఏజెన్సీగా ఉన్న జైకా తో జరిగిన సమావేశం సంతృప్తినిచ్చిందని మంత్రి కేటీ రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్ట్‌ లకు నిధులు ఇచ్చేందుకు సూచన ప్రాయంగా అంగీకారం కుదిరిందని మంత్రి తెలిపారు. ఈపర్యటన సందర్భంగా కొరియా, జపాన్ భారత రాయభార కార్యాలయాలు ఎంతగానో సహకరించాయని తెలిపారు. రెండు భారత రాయభారులకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -