- Advertisement -
గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా జరుగుతోంది. మధ్యాహ్నం అయినా పట్టుమని 20 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు.. అయితే ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఈరోజు బంజారాహిల్స్‌లోని బీఎస్‌జీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఓటేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి చూసి ఓటు వేయాలని ఆమె అభ్యర్థించారు. హైదరాబాదీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఓటు కలిగి ఉండడం ఓ హక్కు అని, మీరు ఓటు వేయని పక్షంలో, మీకు ప్రశ్నించే అవకాశం ఉండదని ఆమె అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేశానని, మీరు కూడా వచ్చి ఓటు వేయాలని ఆమె తన ట్వీట్‌లో కోరారు.
- Advertisement -