కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే. పలుచోట్ల రైతుల ఆందోళన తీవ్రతరం కాగా పోలీసులు బాష్పవాయుడుని ప్రయోగించి రైతుల ర్యాలీలను అడ్డుకున్నారు.
ఇక రైతుల ఆందోళన నేపథ్యంలో స్పందించారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసేందుకు ఇటీవల రూపొందించిన చట్టాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. నిరసన తెలిపే రైతులతో అన్ని అసాధారణ సమస్యలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
దేశంలోని రైతులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నా. వారు ఆందోళనను అంతం చేయాలి.. వారిని చర్చలకు ఆహ్వానిస్తున్నాను. నేను రక్షణ మంత్రిని అయినా.. రైతు కొడుకుగా చర్చలకు పిలుస్తున్నా. మేం ఎప్పుడూ రైతులను మోసం చేయం అన్నారు. కనీస మద్దతు ధరలకు ధాన్యాలు కొనుగోలు కొనసాగుతూనే ఉందని.. భవిష్యత్లో కూడా కొనసాగుతుందన్నారు