జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా 9వ డివిజన్ రామంతా పూర్ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు బూత్ కమిటీల సభ్యులు తదితరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైయ్యారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, డివిజన్ ఇంచార్జీ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిల నేతృత్వంలో డివిజన్ కు చెందిన కాంగ్రెస్, టీడీపీల ముఖ్య నాయకులు, యువకులు భారీ ఎత్తున టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి, మంత్రి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. వాళ్లంతా 9వ డివిజన్ లో టీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. బీజేపీకి సిద్ధాంతాలు, నైతిక విలువలు లేవు. తమకు కావాల్సిన దాని కోసం ఎంతకైనా దిగ జారే పార్టీ. భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు భారతీయ ఝుటా పార్టీగా మారింది. అబద్ధాలను ప్రచారం చేయడమే ఆ పార్టీ సిద్ధాంతంగా మారింది. వరద, బురద రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నది. వాజ్ పేయి, అద్వానీల కాలంలో ఆ పార్టీలో కాస్తో కూస్తో విలువలు ఉండేవని మంత్రి తెలిపారు. సీఎం కేసిఆర్ తరహా పాలన, పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు. ఇన్ని పథకాలు కూడా ఎక్కడ లేవు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలు లేవు అని మంత్రి విమర్శించారు.
ఇంతకు ముందు, ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది?..ఎన్ని లక్షల కోట్ల నిధులు పెట్టుబడులు వస్తున్నాయి?.హైదరాబాద్కి వస్తున్నన్ని పథకాలు దేశంలో మిగతా నగరాలకు ఎందుకు రావడం లేదు. అంటే, మన హైదరాబాద్లో అలాంటి అద్భుత వాతావరణం కల్పించిన ఘనత మన సీఎం కెసిఆర్ మంత్రి కేటీఆర్ లదే. ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరిచే అవకాశాలను ప్రభుత్వం చేపట్టిందని. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సోదాహరణంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలకు వివరించారు.