చేతన్ చీను హీరోగా మధు మాదాసు దర్శకత్వం వహిస్తోన్న చిత్రం విద్యార్థి షూటింగ్ పూర్తి అయ్యింది. బన్నీ వాక్స్ హీరోయిన్. మహాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆళ్ల వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “ఎ లోన్ ఫైట్ ఫర్ లవ్” అనేది ట్యాగ్‌లైన్. డిసెంబర్ నెలాఖరులోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, 2021 జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఆళ్ల వెంకట్ మాట్లాడుతూ, “ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు, మొదటి పాటకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో టీజర్ ట్రెండింగ్‌లో నిలిచింది” అని తెలియజేశారు.
దర్శకుడు మధు మాదాసు మాట్లాడుతూ, “యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ప్రతి వ్యక్తికీ ఒక కథ ఉంటుంది, ప్రతి కథలోనూ ప్రేమ ఉంటుంది. ఈ ఆధునిక యుగంలో మన జ్ఞానం అంగారక గ్రహం దాటేస్తుంటే కుల పిచ్చి ఉన్న కొంత మంది అజ్ఞానం మాత్రం అంటరానితనం నుంచి అంగుళం కూడా దాటటం లేదు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అందరి మన్ననలు పొందుతుంది” అనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు.
తారాగణం:చేతన్ చేన్, బన్నీ వాక్స్, రఘుబాబు, మణిచందన, జీవా, టీఎన్ఆర్, నవీన్ నేని, యడం రాజు, నాగమహేష్, పవన్ సురేష్, శరణ్ అడ్డాల.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: మధు మాదాసు
నిర్మాత: ఆళ్ల వెంకట్
సహ నిర్మాత: రాజేటి రామకృష్ణ
బ్యానర్: మహాస్ క్రియేషన్స్
లైన్ ప్రొడ్యూసర్: వంశీ తాడికొండ
సినిమాటోగ్రఫీ: కన్నయ్య సిహెచ్.
మ్యూజిక్: బల్గనిన్
ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్‌రెడ్డి
ప్రొడక్షన్ డిజైన్: శరణ్ అడ్డాల
పీఆర్వో: వంశీ-శేఖర్
లిరిక్స్: భాస్కరభట్ల, సురేష్ బనిశెట్టి, వాసు వలబోజు
కొరియోగ్రఫీ: అనేష్
స్టంట్స్: రామకృష్ణ