ట్రంప్‌కు మరో షాక్

202
trump
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ సంపూర్ణ మెజార్టీతో విజయం సాధించగా ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించలేదు. డెమోక్ర‌టిక్‌ అధ్య‌క్ష అభ్య‌ర్థి జో బైడెన్ విజ‌యాన్ని స‌వాలు చేస్తూ కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేయగా పెన్సిల్వేనియాలో న‌మోదైన కోట్ల కొద్దీ ఓట్ల‌ను చెల్ల‌నివిగా ప్ర‌క‌టించ‌డానికి అక్క‌డి ఫెడ‌ర‌ల్ జ‌డ్జ్ నిరాక‌రించారు.దీంతో ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది.

పెన్సిల్వేనియా ఓట్ల‌ను చెల్ల‌నివిగా ప్ర‌క‌టించ‌డానికి అంగీక‌రించ‌మని….‌.. బైడెన్ విజ‌యాన్ని గుర్తిస్తూ, ఫ‌లితాల‌ను సోమ‌వారం అధికారులు స‌ర్టిఫై చేస్తార‌ని స్ప‌ష్టం చేశారు. పెన్సిల్వేనియాలో బైడెన్‌కు 81 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది.

ఎన్నిక‌ల ఫ‌లితాల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ట్రంప్ శిబిరం ఇలాంటి 30 కోర్టు కేసుల‌ను కోల్పోవ‌డం లేదా విత్‌డ్రా చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. కేవలం రెండు సంద‌ర్భాల‌లో మాత్ర‌మే ట్రంప్ శిబిరానికి అనుకూలంగా తీర్పులు వ‌చ్చాయి. ఈ తీర్పు వ‌చ్చిన వెంట‌నే రాష్ట్రానికి చెందిన‌ రిప‌బ్లిక‌న్ సెనేట‌ర్ ప్యాట్ టూమీ.. బైడెన్‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు.

- Advertisement -