సుబ్రతా రాయ్‌కి సెబీ అల్టీమేటం..

191
subrata roy
- Advertisement -

సహారా ఇండియా పరివార్‌ గ్రూప్‌ అధినేత సుబ్రతా రాయ్‌కు షాకిచ్చింది సెబీ. తక్షణమే రూ. 62,600 కోట్లు చెల్లించాలని అల్టీమేటం జారీ చేసింది.లేదంటే పెరోల్ కూడా ఇవ్వవద్దని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది సెబీ.

2012లో స‌హారా గ్రూపు కంపెనీలు సెక్యూర్టీ చ‌ట్టాల‌ను ఉల్లంఘించి సుమారు 3.5 బిలియ‌న్ల డాల‌ర్ల సొమ్మును స‌మీక‌రించిన‌ట్లు సుప్రీంకోర్టులో కేసు వేశారు.

ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం సొమ్మును 15 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని గతంలో కోర్ట్ ఆదేశాలు జారీచేసినట్లు గుర్తు చేసింది సెబీ. గతంలో సహారా ఇండియా కొంతమేర డిపాజిట్ చేసిందని , మిగిలిన సొమ్ముతోపాటు వడ్డీలు కలిపి భారీగా రూ. 62,600 కోట్లకు చేరినట్లు సుప్రీం కోర్ట్ కు సెబీ వివరించింది.

- Advertisement -