ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మైనార్టీ, క్రిస్టియన్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో నేడు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ గెలుపుతోనే ఆర్కేపురం అభివృద్ధి సాధ్యమని.. ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని గెలపించుకుంటే డివిజన్‌లో అభివృద్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా ప్రతి పక్షాల అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి పూర్తిగా కుంటుబడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు టీఆర్‌ఎస్ వైపే చూస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ రూ.65వేల కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశారని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.

