కేటీఆర్ కృషి అభినందనీయం..

204
- Advertisement -

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌పై నీటి పారుదల శాఖమంత్రి హరీష్ రావు ప్రశంసల జల్లు కురిపించారు. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలను నెలకొల్పేందుకు కేటీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గచ్చిబౌలిలో సెల్‌ ఫోర్స్ కంపెనీని ప్రారంభించిన హరీష్ …. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి కేటీఆర్‌ పనితీరే నిదర్శనమన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందన్నారు. ఐటీ రంగంలో రూ. 70 వేల కోట్ల ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో ఎగుమతులను రూ. లక్ష కోట్లకు చేరుస్తామని ప్రకటించారు.

సేల్స్‌ఫోర్స్ హైదరాబాద్‌లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలన్నారు. 14 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించామని గుర్తు చేశారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. సేల్స్‌ఫోర్స్‌కు ప్రభుత్వ సహకారం ఉంటుందని ఉద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కంపెనీలపై ఒక్క రాయి కూడా పడలేదని తెలిపారు.

Harish Rao praises KTR

సేల్స్ ఫోర్స్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కంపెనీలు వచ్చే అవకాశం లేదన్నారు. కానీ వాటన్నింటికీ అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టిందన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానమైందన్నారు.

Harish Rao praises KTR

- Advertisement -