రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ( ఆర్.ఎఫ్.సీ.ఎల్ ) సీఈఓ నిర్లేప్ సింగ్ రాయ్, చీఫ్ ఫైనాన్సిల్ ఆఫీసర్ సంజయ్ జిందాల్ బుధవారం అధికారిక నివాసంలో సమావేశమయ్యారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా నియుమితులై ఏడాది అయిన నేపథ్యంలో వారు వినోద్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.రామగుండం ఎరువుల కర్మాగారం పనుల పురోగతి గురించి వినోద్ కుమార్ వారితో ప్రస్తావించారు.
ఎరువుల కర్మాగారం పనులు శరవేగంగా సాగుతున్నాయని, త్వరలోనే ఎరువుల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ఆర్.ఎఫ్.సీ.ఎల్. సీఈఓ నిర్లేప్ సింగ్ రాయ్ తెలిపారు.ఆర్.ఎఫ్.సీ.ఎల్. లో స్థానికులకు ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యతను కల్పించాలని, ఉపాధి అవకాశాలను చూపాలని వినోద్ కుమార్ సీఈఓ రాయ్ ను కోరారు.ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.