మళ్లీ లాక్ డౌన్‌…ప్రసక్తే లేదు: కేంద్రమంత్రి సత్యేందర్

148
lockdown
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో తిరిగి లాక్ డౌన్ విధించనున్నారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు కేంద్రమంత్రి సత్యేందర్ జైన్.

ఢిల్లీలో తిరిగి లాక్ డౌన్ విధించే అవకాశం లేదని… ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్ అంత ఎఫెక్టివ్ స్టెప్ కాద‌ని, దానికంటే న‌గ‌ర ప్ర‌జ‌లు ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు ధ‌రించ‌డం ఉత్త‌మ‌మ‌ని వెల్లడించారు. ఢిల్లీలో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించ‌నున్నారంటూ అస‌త్య ప్ర‌చారం జ‌రుగుతుందని వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్ర‌స్తుతం పండుగ‌ల హడావిడి ముగిసిందని, దాంతో మార్కెట్ల‌లో ర‌ద్దీ కూడా త‌గ్గిపోయింద‌ని చెప్పారు. అందువ‌ల్ల మార్కెట్ల‌ను మూసివేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ఢిల్లీలో కరోనా థ‌ర్డ్ వేవ్ ఇప్ప‌టికే పీక్ ద‌శ‌ను దాటిపోయింద‌ని ఈ పరిస్ధితుల్లో లాక్ డౌన్ సమస్యకు పరిష్కారం కాదన్నారు.

- Advertisement -