తెలంగాణలో‌ టపాసులు కాల్చేందుకు సుప్రీం అనుమతి..

186
Crackers in Telangana
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో బాణసంచా నిషేధంపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బాణసంచా నిషేధంపై ఈ నెల 9న ఎన్జీటీ మార్గదర్శకాలకు హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. ఈ మేరకు గాలి నాణ్యత సూచీల ఆధారంగా టపాసులపై నిషేధం విధించాలని ఎన్జీటీ మార్గదర్శకాల్లో పేర్కొన్నదన్న సుప్రీంకోర్టు.. కాలుష్యం సాధారణంగా ఉంటే రెండు గంటలపాటు టపాసులు కాల్చుకునే అవకాశం కల్పించింది. అలాగే కాలుష్యం సాధారణంగా ఉండే ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

సుప్రీంకోర్టు తీర్పుతో బాణసంచా వ్యాపారులకు ఊరట లభించింది. కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రాకర్స్‌ను నిషేధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయ తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వ్యాపారులు సుప్రీంకోర్టలో శుక్రవారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రెండు గంటల పాటు గ్రీన్‌ క్రాకర్స్‌ కాల్చేందుకు అనుమతినిచ్చింది.

- Advertisement -