క్రాకర్స్ షాపు మూసివేయాలి…ప్రభుత్వ ఆదేశం

148
crackers
- Advertisement -

దీపావళి సందర్భంగా పటాకులపై హైకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో క్రాకర్స్ షాపులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ మేర‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, సీపీల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తెరిచిన దుకాణాలను మూసేయాలని స్పష్టంచేసింది.

పటాకులపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించి కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు.

పటాకుల నిషేధంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదని, కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు స్వీయ నియంత్రణలు పాటిస్తారని ఆశిస్తున్నదని తెలిపారు. పండుగల విషయంలో ఆంక్షలు విధించరాదన్న సదుద్దేశంతో ప్రభుత్వం జాగ్రత్తలు సూచించిందని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్ధానం విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

- Advertisement -