ఏపీలో కొత్తగా 1,886 కరోనా కేసులు నమోదు..

160
corona
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,886 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో 67,910 కరోనా టెస్టులు నిర్వహించగా, 1,886 పాజిటివ్ కేసులు నిర్ధారించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 291 కేసులు వచ్చాయి. అత్యల్పంగా కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో 33 కేసుల చొప్పున గుర్తించారు. ఇక, రాష్ట్రంలో మరో 12 మంది కరోనాతో కన్నుమూశారు.మొత్తం మరణాల సంఖ్య 6,814కి పెరిగింది.

కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఏపీలో ఇప్పటివరకు 8,46,245 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,18,473 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 2,151 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

- Advertisement -