- Advertisement -
నటి,నిర్మాత చార్మీ తాజాగా ట్విట్లర్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. అదికూడా రెబల్‌స్టార్ ప్రభాస్ గురించి. చార్మీ ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. చార్మీ చేసిన ట్వీట్‌లో.. ‘తన 9 నెలల వయసున్న పెంపుడు కుక్కతో ప్రభాస్’ అంటూ పేర్కొంది. ఓ విశాలమైన సోఫాలో కూర్చున్న ప్రభాస్… చార్మీకి చెందిన అలాస్కన్ మలాముటే జాతికి చెందిన జాగిలంతో రాజసం ఒలకబోయడం ఆ ఫొటోలో చూడొచ్చు.
కాగా, ప్రభాస్ పూరీకనెక్ట్స్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ ఫొటోను క్లిక్ మనిపించినట్టు తెలుస్తోంది. ప్రభాస్… పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ చిత్రాల్లో నటించడం తెలిసిందే. ఇక చార్మీ,ప్రభాస్ కలిసి గతంలో పౌర్ణమి, చక్రం చిత్రాల్లో నటించారు.
- Advertisement -