ట్రంప్ ఓటమి.. కేఏ పాల్ డ్యాన్సులు..

241
KA Paul
- Advertisement -

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ గెలుపొందిన సంగతి తెలిసిందే. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ నూతన అధ్యక్షడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ శాంతి ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను గత ఏడాది కాలంగా ట్రంప్ ఓటమికోసం శ్రమిస్తున్నానని వెల్లడించారు. ట్రంప్ ను గతంలోనే హెచ్చరించానని, కానీ ట్రంప్ తన మాట వినలేదని తెలిపారు. ఆయనపై ఓ పుస్తకం కూడా రాసి ఎలుగెత్తానని వివరించారు. ఈ క్రమంలో పాల్‌ అమెరికాలోల వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేశారు. చూడు ట్రంప్… ఈ జనాన్ని చూడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -