కరోనా నష్టం,యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష..

217
kcr cm
- Advertisement -

కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్ధిక నష్టంతో పాటు, ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పనులపై ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రానికి ఏర్పడిన నష్టంపై ప్రగతి భవన్‌లో రివ్యూ నిర్వహించనున్నారు.

కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ జరుపుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు.

ఇక యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై కేసీఆర్ శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆలయ నిర్మాణ పనుల్లో పురోగతిపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో వైటిడిఏ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో తదితరులు పాల్గొననున్నారు.

- Advertisement -