జో బిడెన్…రికార్డులు బ్రేక్!

331
biden
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ దూసుకుపోతున్నారు. మ్యాజిక్ ఫిగర్ 270 ఓట్లు కాగా బిడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా ట్రంప్ 214 ఓట్లు సాధించారు. బిడెన్ గెలుపు లాంఛనమే అయిన ఫలితాలు వెలువడే సరికి ఆలస్యం కానుంది.

అయితే ఈ ఎన్నికల్లో బిడెన్ పలు రికార్డులను నమోదుచేశారు. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామాకు 6,97,98,516 ఓట్లు పోలవగా జో బిడెన్‌ 70.7 మిలియన్లకుపైగా ఓట్లు సాధించారు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారి కంటే ఎక్కువ అని నేషనల్‌ పబ్లిక్‌ రేడియో (ఎన్‌పీఆర్‌) నివేదించింది.

ఇక ఎప్పుడూ రిపబ్లికన్ల వైపు మొగ్గుచూపే కొన్ని రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపారు. వాటిల్లో ఆరిజోనా రాష్ట్రం కూడా ఒకటి.ఆరిజోనా రాష్ట్రం రిపబ్లికన్లకు కంచుకోట లాంటిది. 1948లో ఒకేసారి ఆ రాష్ట్ర ప్రజలు డెమోక్రాట్ పార్టీ వైపు మొగ్గు చూపగా, 1996లో రెండోసారి బిల్ క్లింటన్ కు పట్టంగట్టారు. ఆ తరువాత మరలా ఆ రాష్ట్రం రిపబ్లికన్ల వశం అయ్యింది. అరిజోనాలో జో బిడెన్ విజయం సాధించడంతో అయన ఖాతాలోకి 6 ఎలక్టోరల్ ఓట్లు చేరాయి.

- Advertisement -