గ్రేటర్ ఎన్నికలు…వాలంటీర్లుగా పేర్లు నమోదుచేసుకోండి..

219
lokesh kumar
- Advertisement -

జీహెచ్‌ఎంసీ సాధారణ ఎన్నికలు 2020-21 పోలింగ్ లైవ్ వెబ్ కాస్టింగ్ లో వాలంటీర్లుగా పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని జి హెచ్ ఎం సి ఎన్నికల అధారిటీ & కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

http://bit. ly/GHMCELECTIONS-20 లింక్ ద్వారా ఎన్ రోల్ చేసుకోవచ్చునని తెలిపారు. అలాగే GHMC web site లేదా MyGHMC app ల నుండి కూడా నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే తేదీ వరకు వెబ్ కాస్టింగ్ లో పాల్గొనేందుకు నమోదు చేసుకో వచ్చునని తెలిపారు. నమోదు చేసుకున్న వాలంటీర్లకు ముందస్తుగా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వాలంటీర్లు తమ సొంత లాప్ టాప్ లతో లైవ్ వెబ్ కాస్టింగ్ లో పాల్గొనాలని తెలిపారు.

ఒక రోజు ముందుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కు ముందు రోజు సంబంధిత పోలింగ్ కేంద్రం సమాచారం తెలుపనున్నట్లు వివరించారు. లైవ్ వెబ్ కాస్టింగ్ లో పాల్గొనే విద్యార్థులకు ఏకమొత్తంగా వేతనంతో( రెమ్యూనరేషన్ ) పాటు సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు ఇమెయిల్ id : ghmcelections2020@gmail.com ను సంప్రదించాలని కమీషనర్ సూచించారు.

- Advertisement -