బీజేపీకి షాక్‌.. టీఆర్ఎస్‌లోకి రావుల శ్రీధర్ రెడ్డి..

273
Ravula Sridhar Reddy
- Advertisement -

బీజేపీకి మరో భారీ షాక్‌ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపిలో 11 సంవత్సరాలుగా ఉన్నాను. ఒక ప్రయివేట్ బ్యాంకులో మంచి స్థానంలో ఉన్న నేను తెలంగాణ కోసం ఉద్యోగం వదిలి బీజేపీ పార్టీలో చేరాను. గత పది సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడినా కూడా ప్రజాల్లోనే ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం పూర్తి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతుందని శ్రీధర్ రెడ్డి విమర్శించారు.

బీజేపి ప్రభుత్వతో తెలంగాణకు న్యాయం జరగదు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తుంది. బీజేపీ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. కేంద్రం ఏదైనా బిల్లు తెస్తే పార్టీలో కనీస చర్చ కూడా లేదు. తెలంగాణకు లాభం అవుతుందా లేదా అనే చేర్చే లేదు రాష్ట్ర పార్టీలో. కేటీఆర్ నాయకత్వంలో ఐటీ, పారిశ్రామిక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో కేసీఆర్…కేటీఆర్ నాయకత్వంలో ఐటి రంగం పురోగమిస్తుంది. బీజేపీ ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు.

కేసిఆర్ నాయకత్వంలో పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు నా సహచరలు ఇన్నాళ్లు ఉన్నవాళ్లు అందరూ టిఆర్ఎస్‌లో చేరుతారు.తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని కొనియాడారు. టీఆర్ఎస్‌లో చేరి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా.. నాతో పాటు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నేతలు కలిసి వస్తున్నారు.నాతో వేయి మంది బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వాల్లంతో టీఆర్ఎస్ లోనికి వస్తున్నారని రావుల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -