దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరుపున మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు వీరికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బిజెపొల్లు వంద కార్లేసుకుని ఊర్లలోకి వస్తున్నరు.. ఊరొళ్లు వంద మంది ఉంటలేరు అని ఎద్దేవ చేశారు. పరాయి నాయకులు.. కిరాయి మనుషులే వారికి దిక్కు అన్నారు. ఇక కాంగ్రెస్ టైంలో దొంగరాత్రి కరెంట్ వచ్చేది. కానీ మా ప్రభుత్వం అలా కాదు.. టీఆర్‌ఎస్ చేసేది చెబుతుంది… చెప్పింది చేస్తున్నాం అని మంత్రి తెలిపారు.
అభివృద్ధిని కల్లుండి చూడలేని గుడ్డి పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు. వాళ్ళు సీసాలను, పైసలను, అబద్దలను నమ్ముకున్నరు.వారి మాటలకు మోసపోతే.. గోసపడతం.. అని మంత్రి అన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాం. అసెంబ్లీ ఆమోదం ఇప్పటికే తీసుకున్నాం. రుణమాఫీ ఇదివరకు బ్యాంకుల్లో జమ అయ్యేవి..కానీ ఈ సారి రుణమాఫీ చెక్కులను నేరుగా రైతులకే అందించాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారు. ఎక్కడెక్కడి లీడర్లో వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నరు.. ఎన్నికలయ్యాక వారెవరైనా ఇక్కడ ఉంటారా ? పిలిస్తే పాలికేది నేనె…ఫోన్ చేస్తే సమస్య పరిష్కరించేది నేనె.. అని వ్యాఖ్యనించారు. అయినా ఇక్కడ వాళ్ళ తోటి ఏమైతది. రేవంత్ రెడ్డిని కొడంగల్‌కు పోయి ఓడించినా.. ఇది నా గడ్డ వాళ్లొచ్చి ఏం చేస్తరు అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.