ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..

191
kcr
- Advertisement -

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభించారు. ధరణి పోర్ట‌ల్‌నుధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభం కంటే ముందు సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ఈ పోర్టల్ ను వేదమంత్రోచ్చారణ మధ్య ముఖ్యమంత్రి ప్రారంభించారు. పోర్టల్ ప్రారంభంతో, ఇప్పటి వరకు పుస్తకాలకే పరిమితమైన భూముల వివరాలు ఇకపై ఆన్ లైన్ కాబోతున్నాయి.

ఇకపై వ్యవసాయ, వ్యవసాయేతర రికార్డులన్నీ ధరణి పోర్టల్ లో ఉండబోతున్నాయి. ప్లాట్ బుకింగ్ నుంచి పాస్ పుస్తకాల వరకు అన్నీ పోర్టల్ లోనే ఉంటాయి. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతాయి. ఈ పోర్టల్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పోర్టల్ ప్రారంభమైన నేపథ్యంలో నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు, మంత్రి మ‌ల్లారెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -